: ప్రాజెక్టుల వద్ద కొనసాగుతున్న వరద ఉద్ధృతి.. గేట్లు ఎత్తివేత


భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 39 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4,94,780 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 4,16,600 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 16.6 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు. అలాగే మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ఇక్కడ ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 84 వేల క్యూసెక్కులు. ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ప్రస్తుత నీటిమట్టం 21.5 అడుగులుగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండు కుండలా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 190.33 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 1,41,608 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 75,776 క్కూసెక్కులు.

  • Loading...

More Telugu News