: శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా రక్తం ఏరులై పారుతుంది.. భారత్‌ను హెచ్చరించిన పాక్


శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా రక్తం ఏరులై పారడం ఖాయమని పాకిస్థాన్ సమాచారశాఖా మంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ఉరీ ఘటన తర్వాత పాక్‌ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తున్న భారత్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నిజమైన క్రూరులే ఏకాకులు అవుతారని పేర్కొన్న రషీద్, శ్రీనగర్‌లో అశాంతి నెలకొన్నన్ని రోజులు న్యూఢిల్లీ కూడా ప్రశాంతంగా ఉండబోదని అన్నారు. కశ్మీర్‌లోని అమాయకులపై సైన్యం పాల్పడుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు భారత్ పక్కా ప్రణాళికతో పాక్‌పై బురద జల్లుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా నిరాధార ఆరోపణలు మానుకుంటే మంచిదని భారత్‌కు హితవు పలికారు.

  • Loading...

More Telugu News