: ఆ రోజు సుష్మాస్వరాజ్ కాళ్లు పట్టుకున్న విషయం నిజమే!: పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్రం కోసం విభజన బిల్లు సమయంలో తాను బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకున్న విషయం నిజమేనని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. విభజన బిల్లు సమయంలో జరిగిన ఘటనలపై ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే తాను సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందని, ఆమె తమ పార్టీ నేత కాదు కాబట్టి ఆ విధంగా బతిమిలాడుకోవాల్సి వచ్చిందని పొన్నం పేర్కొన్నారు. విభజన బిల్లుకు తాము మద్దతు ఇచ్చిన తర్వాత హెడ్ కౌంట్ అవసరం లేదని నాడు సుష్మాస్వరాజ్ చెప్పారన్నారు. పార్లమెంట్ లో విభజన బిల్లు పాస్ అయినపుడు ప్రత్యక్ష సాక్షిగా తాను అక్కడ వున్నానని పొన్నం చెప్పారు.