: కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్న ఐకాస నేతలు
తెలంగాణ మంత్రి కేటీఆర్ వాహనాన్ని సిరిసిల్ల జిల్లా సాధన ఐకాస నేతలు అడ్డుకున్నారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేతలు నినాదాలు చేస్తూ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లింగాపురంలో ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సంఘటనతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.