: 377/5 వద్ద డిక్లేర్ చేసిన ఇండియా.. కివీస్ లక్ష్యం 433


మూడు టెస్టు సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 433 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ 377/5 వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ అధిక్యం 56 పరుగులు కలుపుకుని 433 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచింది. 159/1 ఓవర్ నైట్ స్కోర్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ సేన నిలకడగా ఆడింది. ఈరోజు ఆటలో మురళీ విజయ్(76) వికెట్ కోల్పోయిన భారత్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ (18) వికెట్ ను నష్టపోయింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో చటేశ్వర పుజారా (78) అవుట్ కావడంతో భారత్ కొంచెం తడబడినట్లు కనిపించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 318 ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 262 పరుగులకే కుప్పకూలింది.

  • Loading...

More Telugu News