: తూర్పుగోదావరి జిల్లాలో అదుపుతప్పిన గ్యాస్ టాంకర్


ఎల్పీజీ లోడుతో వెళ్తున్న ఒక గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి వద్ద జరిగింది. ఈరోజు మధ్యాహ్నం గోకవరం మండలం గుమ్మడిదొడ్డి ప్లాంట్ కు వెళుతున్న ఈ ట్యాంకర్ చెందుర్తి వద్ద 16వ జాతీయ రహదారిపై అదుపుతప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ సమాచారం తెలుసుకున్న సిబ్బంది విశాఖపట్టణం నుంచి అక్కడికి చేరుకున్నారు. ఈ ట్యాంకర్ లోని గ్యాస్ ను మరో ట్యాంకర్ లోకి ఎక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News