: 1969కి ఫోన్ చేయండి... టాయ్ లెట్ ను తెచ్చుకోండి: మోదీ


ఇండియాలో బహిరంగ మల విసర్జనను నూరు శాతం నిర్మూలించేందుకు సరికొత్త ఫోన్ నెంబర్ '1969'ని ప్రారంభిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. 1869లో మహాత్మా గాంధీ జన్మించారని, 1969లో ఆయన శతజయంతి ఉత్సవాలు జరుపుకున్నామని, 2019లో 150వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని గుర్తు చేసిన ఆయన, ఈ నెంబరుకు ఫోన్ చేస్తే, తమ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు ఎంతవరకూ వచ్చాయో తెలుసుకోవచ్చని, ఇప్పటికీ టాయ్ లెట్స్ లేని వారు వాటి కోసం రిక్వెస్ట్ చేయవచ్చని తెలిపారు. ఆ వెంటనే ప్రభుత్వం స్పందిస్తుందని వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని భారతీయులు వినియోగించుకోవాలని సూచించారు. కార్పొరేట్ సంస్థలు తమ సీఎస్ఆర్ కార్యకలాపాల్లో భాగంగా, స్వచ్ఛ భారత్ కు సహకరించాలని మోదీ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News