: రెండో ఇన్నింగ్స్ లోనూ విఫలమైన కోహ్లీ!
న్యూజిలాండ్ తో జరుగుతున్న పోరులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లోనూ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 9 పరుగులకే అవుట్ అయిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్ లో 18 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 40 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన కోహ్లీ, క్రెయిగ్ బౌలింగ్ లో సోధీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారి పట్టాడు. దీంతో భారత జట్టు 68 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మరో ఎండ్ లో నిలకడగా ఆడుతున్న పుజారా 73 పరుగులతో భారీ స్కోరు దిశగా సాగుతుండగా, అతనికి అజింక్య రహానే వచ్చి కలిశాడు.