: జగన్ రిమాండ్ పొడిగింపు
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రిమాండ్ ను సీబీఐ కోర్టు నేడు పొడిగించింది. ఈ కేసులో జగన్ తోపాటు మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ ల రిమాండ్ ను వచ్చేనెల 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిని సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.