: పెద్దగా శ్రమ లేకుండా జియో సిమ్ లభించే మార్గమిది!
రిలయన్స్ జియో... ఇప్పుడు సిమ్ ను పొందినా మూడు నెలలకు పైగా ఉచిత 4జీ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అనుభవించవచ్చు. ఇప్పటికీ సిమ్ ల కొరత కనిపిస్తూనే ఉండగా, రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ స్టోర్ల ముందు సిమ్ ల కోసం క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, సిమ్ లను సులువుగా పొందేందుకు రిలయన్స్ సంస్థ ఓ మార్గాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా 1800-200-200-2 నెంబరుకు మీ ఫోన్ నుంచి కాల్ చేయాలి. ఆపై మీ ఫోన్ కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో ఉన్న లింక్ ను క్లిక్ చేస్తే, ప్లే స్టోర్ నుంచి 'మైజియో' యాప్ డౌన్ లోడ్ అవుతుంది. దాన్ని ఇన్ స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే మొట్టమొదట 'గెట్ జియో సిమ్' అన్న బ్యానర్ కనిపిస్తుంది. ఆపై నిబంధనలను అంగీకరించి, 'గెట్ జియో సిమ్ ఆఫర్'పై క్లిక్ చేస్తే, మీ లొకేషన్ ను తెలియజేయాలన్న మెసేజ్ వస్తుంది. మీరెక్కడుంటారో చెప్పి, నెక్ట్స్ బటన్ క్లిక్ చేస్తే, మీ మొబైల్ స్క్రీన్ పై 'ఆఫర్ కోడ్' కనిపిస్తుంది. ఈ ఆఫర్ కోడ్ తో పాటు ఐడీ ప్రూఫ్, ఫోటో, రెసిడెన్స్ ప్రూఫ్ తదితరాలను తీసుకుని రిలయన్స్ స్టోర్ కు వెళితే, వెంటనే సిమ్ లభిస్తుందని తెలిపింది.