: ట్రాన్స్ ఫర్ చేయాలంటే నేనే చెయ్యాలిగా... చెయ్యను: జీహెచ్ఎంసీ కమిషనర్ పై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి బదిలీ తప్పదని గత కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలకు సీఎం కేసీఆర్ తెరదించారు. ఆయన్ను ట్రాన్స్ ఫర్ చేయాలంటే తానే చెయ్యాలని చెప్పిన కేసీఆర్, సమర్థవంతంగా పనిచేస్తున్న ఆయన్ని బదిలీ చేయబోనని స్పష్టంగా చెప్పారు. జనార్దన్ రెడ్డి సౌమ్యుడిగా ఉండటం, అధికారులతో సాఫ్ట్ గా వ్యవహరిస్తుండటాన్ని అలుసుగా తీసుకున్న పలువురు బాహాటంగానే అక్రమ దందాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో మరెవరినైనా నియమిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో పనిచేసుకుపోతూ, కోట్ల రూపాయల అవినీతిని ఆపి, పెండింగ్ లోని ఏసీబీ కేసుల్లో కదలిక తెచ్చి, గ్రేటర్ ఎన్నికలను విజయవంతం చేసిన జనార్దన్ రెడ్డిని మరింతకాలం పాటు కొనసాగించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని, ఆయన తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.