: వందేళ్ల రికార్డును తిరగరాసిన భారీ వర్షాలు.. ఆర్మూరులో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. అత్యధిక వర్షపాతం నమోదులో తెలంగాణ రికార్డు సృష్టించింది. గత 24 గంటల్లో కురిసిన వర్షానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై గత రికార్డులను తుడిచేసింది. ఇక్కడ ఏకంగా 39.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం.. సెప్టెంబరు 28, 1908న వరంగల్ జిల్లా హన్మకొండలో 30.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత జూలై 10, 1954న ఖమ్మంలో 30 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. అక్టోబరు 6, 1983న నిజామాబాద్‌లో 35.5 సెం.మీ. వర్షపాతం నమోదై పాత రికార్డులను తుడిచేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఇదే అత్యధిక వర్షపాతం. కాగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి గత వందేళ్ల రికార్డులు కొట్టుకుపోయాయి. 24 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 39.5 సెం.మీ. వర్షపాతం నమోదు కావడంతో వాతావరణ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News