: అభివృద్ధి చెందిన దేశాల రెస్టారెంట్ల కంటే భారత్‌ రెస్టారెంట్లే భేష్!: ట్రావెలర్ మేగజీన్ ప్రశంసలు


భారత రెస్టారెంట్లు భేష్ అని 'కండే నాస్ట్ ట్రావెలర్' (సీఎన్ టీ) మ్యాగజీన్ కీర్తించింది. ఈ మ్యాగజీన్ ప్రతినిధులు ప్రతి ఏటా వివిధ అంశాలపై ప్రపంచ వ్యాప్త పరిశోధనలు చేస్తారు. ఈ ఏడాది ప్రపంచంలోని 207 పర్యాటక ప్రదేశాల్లో ఈ మ్యాగజీన్ సిబ్బంది పర్యటించారు. ఈ పర్యటనలో ఆయా పర్యాటక ప్రాంతాల్లో నివాసయోగ్యంగా ఉండేవి, మంచి ఆహారం లభించే వాటిని గుర్తించారు. వాటికి ర్యాంకులను కేటాయించారు. ఇందులో భారత్ కు చెందిన రెస్టారెంట్లు స్థానం దక్కించుకున్నాయి. ముంబైలోని బొంబే రెస్టారెంట్‌, ఢిల్లీలోని బుక్రా, ఇండియన్‌ ఎసెంట్‌ రెస్టారెంట్లు పర్యాటకులకు మంచి సేవలు అందిస్తున్నాయని వారు ప్రశంసించారు. ఇవి ప్రపంచంలోని ఉత్తమ రెస్టారెంట్లుగా నిలిచాయని వారు అభిప్రాయపడ్డారు. వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఈ రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు రుచి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సీఎన్ టీ ప్రతినిధులు పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని రెస్టారెంట్లతో పోల్చితే భారత్‌ లో ఈ రెస్టారెంట్లు ఉత్తమమని వారు కొనియాడారు.

  • Loading...

More Telugu News