: అంబానీ, అదానీలను కాంగ్రెస్సే తయారు చేసింది: వెంకయ్యనాయుడు


ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు అంబానీ, అదానీలను కాంగ్రెస్సే తయారు చేసిందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కేరళలోని కోజికోడ్ లో ఆయన మాట్లాడుతూ, తన హయాంలోనే అంబానీ, అదానీలను ఎదిగేలా చేసిన యూపీఏ ఇప్పుడు ఆ ఇద్దరినీ బీజేపీకి లింక్ పెడుతోందని ఆయన మండిపడ్డారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ అధినేత్రి తీసుకున్న నిర్ణయాలను ప్రధాని అమలు చేస్తే, ఎన్డీయే హయాంలో ప్రధాని మోదీ కేబినెట్ తో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం పేదలు, మహిళలు, యువకుల కోసం పనిచేస్తోందని ఆయన తెలిపారు. వంశపారంపర్య రాజకీయాలకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తే, తాము దేశానికి ప్రాధాన్యతనిస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలు అవినీతికి కొమ్ముకాశాయని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News