: యూరీ దాడి ప్రభావం.. భారత్‌లో పాక్ వాణిజ్య ప్రదర్శన రద్దు
ఇటీవల పాక్ ఉగ్రవాదులు యూరీలో దాడి చేసి భారత సైనికుల ప్రాణాలు తీసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి. వచ్చే నెలలో భారత్‌లో పాకిస్థాన్ ఓ వాణిజ్య ప్రదర్శన నిర్వహించాల్సి ఉంది. భారత్‌లో 2012, 2014ల్లో 'అలీషాన్ పాకిస్థాన్' ఎగ్జిబిషన్ నిర్వహించింది. అయితే మూడో ఎడిషన్‌గా వచ్చేనెల ఢిల్లీలో ఈ ప్రదర్శన జరగాల్సి ఉండగా ఇరు దేశాల మధ్య ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల కారణంగా తమ ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు ట్రేడ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ ఇస్లామాబాద్ లో ప్రకటించింది.