: ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా 9 సంవత్సరాలుగా స్టోర్ కు కాపలా కాస్తున్న మార్జాలం!


బోబో... ఈ పిల్లి వయసు 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలుగా న్యూయార్క్ లోని ఓ స్టోర్ ను కంటికి రెప్పలా కాపాడుతోంది. అదికూడా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా! ఎవరి నుంచి అనుకుంటున్నారు? ఎలుకల నుంచి. చైనా టౌన్ అనే పేరున్న ఓ స్టోర్ లోకి తొమ్మిదేళ్ల క్రితం ఇది వచ్చింది. అప్పటి నుంచి స్టోర్ దాటి బయటకు వెళ్లలేదు. ఇప్పుడు దానికి స్నేహితులు కూడా ఉన్నారు. "ఈ స్టోర్ లో అది గుమ్మం ముందు కూర్చుంటుంది. వచ్చే వాళ్లను ఆహ్వానిస్తుంది. ఎవరి కాళ్లకూ అడ్డంపడదు. దానికంటూ ఉన్న ప్రత్యేక దారిలోనే నడుస్తుంది. ఎంతో ఆసక్తిగా కిటికీలో నుంచి చూస్తుంటుంది" అని అదే షాపులో బోబో కన్నా ఏడేళ్లు తక్కువ సర్వీస్ లో ఉన్న ఏనే అనే ఉద్యోగిని వెల్లడించింది. ఈ స్టోర్ కు 'బోబో'యే రారాజని, వచ్చి పోయే వారితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తుందని చెబుతూ 'లవ్ మ్యావ్' (పిల్లులను ఇష్టపడేవారి బ్లాగ్) లో బోబో గురించి చెప్పగా, అదిప్పుడు వైరల్.

  • Loading...

More Telugu News