: జర్నలిస్టులపై పోలీసుల దౌర్జన్యం... సారీ చెప్పిన చంద్రబాబు


పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్న సందర్భంగా, జరుగుతున్న ర్యాలీలో పోలీసుల అత్యుత్సాహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పోలీసులు జర్నలిస్టులపై దౌర్జన్యం చేయడంతో పలు టీవీ చానళ్ల కెమెరామెన్లు కింద పడిపోయారు. దీంతో జర్నలిస్టులు ఆగ్రహించి, చంద్రబాబు ర్యాలీని అడ్డుకుని ధర్నా నిర్వహించారు. టూర్ ను కవర్ చేసేది లేదని నిరసన తెలిపారు. ర్యాలీ ఆగిన కారణాన్ని తెలుసుకున్న చంద్రబాబు, వారి వద్దకు వెళ్లి, క్షమాపణలు చెప్పారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి, మరోసారి ఇలా జరగకుండా చూస్తానని చెప్పడంతో జర్నలిస్టులు శాంతించారు. ఆపై ర్యాలీ కొనసాగింది.

  • Loading...

More Telugu News