: సూర్యుడి లాంటి మరో నక్షత్రం చివరి రోజులను బంధించిన నాసా... కలర్ ఫుల్ చిత్రమిది!


అనంత విశ్వంలో జరిగే అద్భుతాల్లో ఒకటిగా చెప్పుకునే నక్షత్ర మరణాన్ని నాసా చిత్రీకరించింది. భూమికి నాలుగు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎన్జీసీ 2440 అనే నక్షత్రం నశిస్తున్న వైనాన్ని, హబుల్ టెలిస్కోప్ ఫోటో తీయగా, దానిని నాసా విడుదల చేసింది. నాసా అందించిన వివరాల ప్రకారం, ఈ నక్షత్రం కేంద్రంలో 2 లక్షల డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత ఉంది. తన బరువును శరవేగంగా కోల్పోతూ, విశ్వంలోకి ఇది భారీ ఎత్తున వాయువులను వెదజల్లుతోంది. దుమ్ము, ధూళితో కూడిన మేఘాలు నక్షత్రం చుట్టూ ఉండగా, దానిపై పేలుళ్లు, అవి వెలువరిస్తున్న వాయువులు పలు రంగుల్లో కనిపిస్తున్నాయి. ఆ చిత్రాన్ని మీరూ చూడండి

  • Loading...

More Telugu News