: ప్రభుత్వ ఆదేశాలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు: తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హైదరాబాద్‌లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినా ఈరోజు కూకట్‌పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో పాఠశాలలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని మీడియాకు చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే ఆదేశాలను పాటించాల్సిందేనని సూచించారు. ఆదేశాలు పాటించని పాఠశాలకు నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు.