: ప్రమాదకర విలియమ్ సన్ ను వెనక్కి పంపిన అశ్విన్... వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్


కాన్పూర్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడవ రోజు ఆట మొదట్లోనే భారత్ పట్టు బిగించింది. 75 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతున్న విలియమ్ సన్ ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన బాల్ తో పెవీలియన్ దారి పట్టించాడు. రెండో రోజున ఒక వికెట్ నష్టానికి 152 పరుగులతో న్యూజిలాండ్ ఆట మొదలు పెట్టగా, స్కోర్ బోర్డుపై 20 పరుగులు చేరకుండానే మూడు వికెట్లను భారత బౌలర్లు తీశారు. 159 పరుగుల వద్ద లాథమ్ (58), 160 పరుగుల వద్ద టేలర్, 170 పరుగుల వద్ద విలియన్ సన్ అవుట్ అయ్యారు. లాథమ్, విలియమ్ సన్ వికెట్లను అశ్విన్ తీయగా, టేలర్ వికెట్ జడేజాకు దక్కింది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు కాగా, భారత తొలి ఇన్నింగ్స్ తో పోలిస్తే, ఆ జట్టు 146 పరుగులు వెనుకబడివుంది.

  • Loading...

More Telugu News