: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద.. 70 గేట్లు ఎత్తివేత


ప్రకాశం బ్యారేజీకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1.36 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 1.30 లక్షల క్యూసెక్కులు. వరద ఉద్ధృతి పెరగడంతో జలవనరుల శాఖ అధికారులు 70 గేట్లు ఎత్తివేసి నీటిని బయటకు పంపిస్తున్నారు. కాల్వలకు 6500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. వరద మరింత కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గంటగంటకు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News