: నిజామాబాద్ జిల్లాలో విషాదం.. అలుగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన మహిళ, చిన్నారి
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువు అలుగు ఉద్ధృతికి చిన్నారి సహా ఓ మహిళ కొట్టుకుపోయింది. బేలంపూర్ మండలం నవాబ్ చెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో కారు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దీంతో కారులోని కుటుంబ సభ్యులు కిందికి దిగి అలుగు దాటుతుండగా చిన్నారి హర్షిత్, ప్రియాంక అనే మహిళ కొట్టుకుపోయారు. దీంతో వారి కోసం చెరువులో గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. హర్షిత్, ప్రియాంక కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.