: 11 కేసుల్లో నిందితుడైన జగన్ సీఎం అవుతానని చెప్పుకోవడం సిగ్గుచేటు: ఎమ్మెల్సీ సోమిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడిని కేసుల్లోకి లాగాలని ప్రతిపక్ష పార్టీ చేస్తోన్న ప్రయత్నాలన్నీ వృథాయేనని, చంద్రబాబుని దోషిగా నిలబెట్టడం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లే కాలేదని, ఇక జగన్ వల్ల ఏమమవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రయోజనాలు పట్టని జగన్ హోదా కోసం పోరాటం అంటూ సభలు నిర్వహించడం హాస్యాస్పదని ఆయన అన్నారు. 11 కేసుల్లో నిందితుడయిన జగన్ నిన్న నిర్వహించిన యువభేరిలో మాట్లాడుతూ సీఎం అవుతానని అన్నారని, అలా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. జగన్ యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.