: ‘గండిపేట’కు జలకళ...పెరుగుతున్న సందర్శకుల తాకిడి
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గండిపేట చెరువు జలకళ సంతరించుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, ఈ దృశ్యాలను తిలకించేందుకు వస్తున్న సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. అయితే, గండిపేట జలాశయం నీటిమట్టం పెరుగుతుండటంతో సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులు సూచనలు చేశారు.