: వర్షాలు పడుతున్నా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండలేదు: దేవినేని ఉమ


ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండలేదని ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రాజెక్టులు నిండాకే కర్ణాటక మనకు నీళ్లు వదులుతోందని అన్నారు. 1.84 లక్షల క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టు నుండి విడుదల చేశామన్నారు. పులిచింతల దగ్గర 30 టీఎంసీల నీటిని నిలువచేస్తామని, గోదావరి నుంచి రెండు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోందని దేవినేని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News