: జ‌య‌ల‌లిత తొంద‌ర‌గా కోలుకోవాలంటూ పూజ‌లు నిర్వ‌హిస్తోన్న అభిమానులు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గుర‌యిన విష‌యం తెలిసిందే. గత అర్ధరాత్రి ఆమెను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. కొద్ది సేప‌టి క్రితం ఆసుప‌త్రి వైద్యులు జయలలిత ఆరోగ్యంపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ముఖ్య‌మంత్రి ఆరోగ్యంగానే ఉన్నారని అందులో పేర్కొన్నారు. జ‌య‌ల‌లిత‌కు జ్వ‌రం త‌గ్గిందని చెప్పారు. ప్ర‌స్తుతం ఆమె ఆసుప‌త్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత మెరుగుపడగానే డిశ్చార్జి చేస్తామ‌ని చెప్పారు. మరోవైపు జ‌య‌ల‌లిత అభిమానులు ఆమె తొందరగా కోలుకోవాలని కోరుతూ త‌మిళ‌నాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News