: నారాయణగూడ-రాంకోఠి మార్గంలో కూలిన భారీ చెట్టు.. రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా నగరంలోని నారాయణగూడ-రాంకోఠి మార్గంలో ఓ భారీ వృక్షం నేలకూలింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టుని తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ జిల్లా పెద్ద శంకరం పట్నంలోనూ రోడ్డుపై ఓ చెట్టు నేలకొరిగింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎర్రకుంట చెరువు కట్ట తెగే ప్రమాదం ఏర్పడింది. అప్రమత్తమయిన రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ఇసుక బస్తాలు వేసి చెరువుకి గండిపడకుండా ఆపారు. వర్షాలతో శామీర్ పేట జంక్షన్ నుంచి కీసర, ఘట్‌కేసర్ జంక్షన్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందులో తహశీల్దార్ కార్యాలయ భవనం పైకప్పు కూలింది. వరంగల్ జిల్లాలోని హన్మకొండ జవహర్ కాలనీలో భారీగా వరద నీరు చేరింది.