: వికెట్ తీసిన ఉమేష్ యాదవ్... కట్టుదిట్టమైన బౌలింగ్... జాగ్రత్తగా ఆడుతున్న కివీస్ బ్యాట్స్ మన్


న్యూజిలాండ్ తో తొలిటెస్టు ఆడుతున్న భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి తడబాటు లేకుండా న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఓవర్ నైట్ స్కోర్ 291/9 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు కేవలం 27 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టు ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్లు గుప్తిల్ (21), లాతమ్ (20) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. పదో ఓవర్లో మ్యాజిక్ చేసిన ఉమేష్ యాదవ్ అద్భుతమైన బంతిని సంధించి గుప్తిల్ ను ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. అనంతరం లాతమ్ కు కెప్టెన్ విలియమ్సన్ (7)జత కలిశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు తొలి సెషన్ లో 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 56 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News