: వర్షం ఎఫెక్ట్...నాలుగు విమానాలు ఆలస్యం
హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలు విమానరాకపోకలపై ప్రభావం చూపించాయి. వాతావరణం మేఘావృతమై ఉండడంతో వెలుతురు సరిపోక రెండు విమానాలు వెనుదిరగగా... మరోపక్క ఈ వర్షాల కారణంగా, హైదరాబాదు-విశాఖపట్టణం, గోవా-రాజమండ్రి, హైదరాబాదు-తిరుపతి, హైదరాబాదు-చెన్నై విమానాలు రెండు గంటలు ఆలస్యంగా నడవనున్నాయి. దీంతో పాటు పలు అంతర్జాతీయ సర్వీసులకు కూడా ఇబ్బందులు ఎదురయినట్టు తెలుస్తోంది.