: విశాఖ గంట్యాడలో అగ్ని ప్రమాదం


విశాఖపట్టణం శివారులోని గాజువాక పెదగంట్యాడలో ఓ ప్లాస్టిక్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో అవి మరో రెండు కంపెనీలకు విస్తరించాయి. అక్కడి నుంచి ప్లాస్టిక్ నిల్వ ఉంచే గోడౌన్లకు అంటుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 6 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. ఫోమ్‌, నీరు ఇతర సాధనాల ద్వారా మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్లాస్టిక్ గోడౌన్లు కావడంతో మంటలు అదుపులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News