: అయ్యప్ప సన్నిధిలో ‘హరిహరాసనం’ పాట ఆలపించిన ఏసుదాసు
శబరిమల ఆలయంలోని అయ్యప్పస్వామి సన్నిధిలో ప్రముఖ గాయకుడు ఏసుదాసు స్వయంగా ‘హరిహరాసనం స్వామి విశ్వమోహనం’ పాటను ఆలపించారు. ఓనం పండగ చివరి రోజు సందర్భంగా ‘కన్నీ’ వేడుకల్లో భాగంగా ఈరోజు ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం బోర్డు వినతి మేరకు అయ్యప్పస్వామిని నిద్ర పుచ్చేందుకు గాను ఈ పాటను ఆయన ఆలపించారు. ఏసుదాసు గానం చేస్తుండగా భక్తులు కూడా జత కలిశారు. ఆయన అద్భుత గానానికి భక్తులు తాదాత్మ్యం చెందారు.