: ఆరాధ్యను వదిలి రాలేనని ముందే చెప్పాను: ఐశ్వర్యారాయ్


ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే ‘యే దిల్ హై ముష్కిల్’ ప్రచార కార్యక్రమానికి తాను రాలేనని ముందే చెప్పానని బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ చెప్పింది. ఎందుకంటే, తన కూతురు ఆరాధ్యను వదిలిపెట్టి చిత్ర ప్రచారకార్యక్రమాల్లో పాల్గొనడం కష్టమని దర్శకుడు కరణ్ జోహార్ కు మొదట్లోనే చెప్పానని.. అందుకు, ఆయన కూడా ఒప్పుకున్నారని ఐష్ పేర్కొంది. ఈ సినిమాకు సంతకం చేయకముందే ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని తెలిపింది. అయితే, ‘యే దిల్ హై ముష్కిల్’ ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమానికి మాత్రమే ఐశ్వర్యా రాయ్ హాజరుకానుందట. ఈ చిత్రం ట్రైలర్ ను రేపు విడుదల చేయనున్నారు. కాగా, కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ సరసన ఐశ్వర్య రాయ్ నటిస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. దీపావళి పండగకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News