: ఈ ఏటి ‘ఆస్కార్’ కు తమిళ చిత్రం ‘విశారణై’


ఈ ఏటి ‘ఆస్కార్’కు విదేశీ చిత్రాల కేటగిరిలో మన దేశం తరఫున తమిళ చిత్రం ‘విశారణై’ ఎంపిక అయింది. ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసినట్లు జ్యూరీ చైర్మన్ కేతన్ మెహతా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, 2015లో తమిళ దర్శకుడు వెట్రిమారన్ ‘విశారణై’ను తెరకెక్కించారు. రచయిత ఎం. చంద్రకుమార్ నవల ‘లాకప్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘విశారణై’లో నటులు దినేష్, ఆనందిని, ఆదుకాలం మురుగదాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నేషనల్ ఫిల్మ్ అవార్డు (బెస్ట్ ఎడిటింగ్)ను, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News