: సచిన్ వెళ్లకుంటే, మేమే కచ్చితంగా తీసేసేవాళ్లం: పదవి పోయాక సందీప్ పాటిల్


భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి పోయిన తరువాత సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ తన రిటైర్ మెంటును ప్రకటించకుంటే, తామే తీసేయాలన్న నిర్ణయానికి వచ్చామని ఆయన తెలిపాడు. మరాఠీ చానల్ 'ఏబీపీ మజా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశాడు. "డిసెంబర్ 12, 2012న మేము సచిన్ ను కలసి 'నీ భవిష్యత్ ప్లాన్ ఏంటి?' అని అడిగాము. తన మనసులో రిటైర్ మెంట్ ఆలోచన లేదని చెప్పాడు. అప్పట్లో సెలక్షన్ కమిటీ సచిన్ ను తొలగించాలన్న నిర్ణయానికే వచ్చింది. ఇదే విషయాన్ని సచిన్ కు చెప్పాము. మా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆయన, తదుపరి సమావేశం జరిగే లోగానే వన్డేలకు రిటైర్ మెంట్ ప్రకటించాడు. అతనలా చేయకుంటే, మేమే కచ్చితంగా తొలగించి వుండేవాళ్లం" అని అన్నాడు. సచిన్ రిటైర్ మెంటుపై దాదాపు రెండేళ్ల తర్జన భర్జనలు జరిగాయని తెలిపాడు.

  • Loading...

More Telugu News