: 500వ టెస్టుకు హాజరైన సచిన్, గంగూలీ, ధోనీ


కాన్పూర్ వేదిక‌గా టీమిండియా, న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ల‌ మధ్య కొన‌సాగుతున్న భార‌త్ 500వ టెస్టు మ్యాచుకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ, టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌ ఎం.ఎస్.ధోనీ హాజరయ్యారు. మ్యాచ్‌ను ప్రేక్ష‌కుల‌తో క‌లిసి వీరు ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు. భారత్ 500వ మ్యాచ్ ఆడుతుండ‌డంతో బీసీసీఐ మైదానంలో ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ్యాచ్‌ను చూసేందుకు ప‌లువురు ప్ర‌ముఖులకు బీసీసీఐ ఆహ్వానం పంపింది. క్రికెట్ మైదానం అంతా సంద‌డిగా క‌నిపిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ కావడంతో టీం ఇండియా క‌సిగా బ్యాటింగ్ కొన‌సాగిస్తోంది. కోహ్లీ సారథ్యం వహిస్తోన్న టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News