: ‘యువభేరి’ కోసం గన్నవరం చేరుకున్న జగన్.. ర్యాలీ ప్రారంభం
ప్రత్యేక హోదాపై కేంద్రం తీరుని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఏలూరులో నిర్వహించతలపెట్టిన యువభేరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి హనుమాన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను యువభేరి ద్వారా రాష్ట్ర యువతకు ఆయన వివరించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హోదా రాకపోతే తలెత్తే సమస్యలను యువతకు వివరించి చెప్పనున్నారు.