: గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. మానవపాడులో రైలు నిలిపివేత


గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో రైల్వే సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా అలంపూర్‌-మానవపాడు మధ్య ప్రయాణిస్తున్న గోరఖ్‌ పూర్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలులో ఏసీ బోగీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. వీటిని గుర్తించిన రైలు సిబ్బంది వెంటనే రైలును మానవపాడులో నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో రైలులో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎక్స్‌ ప్రెస్‌ రైలులోని ఎలక్ట్రికల్‌ ప్యానెల్‌ అగ్నికి ఆహుతైంది.

  • Loading...

More Telugu News