: బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ జంట విడిపోవడం కంటే ముందే వారి విగ్రహాలు విడిపోయాయి!


హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడిపోవడానికి ముందే లండన్ టుస్సాడ్స్ మ్యూజియంలోని వారి విగ్రహాలు విడిపోయాయి. బ్రాడ్ పిట్ వ్యవహార శైలితో విసిగిపోయిన ఏంజెలినా జోలి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే టుస్సాడ్స్ లోని వారి మైనపు విగ్రహాలను వేరు చేశారు. ఈ మేరకు ‘టుస్సాడ్స్’ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసింది. బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలి విడాకులు తీసుకోనున్న విషయం తెలియడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆ విగ్రహాలను వేరు చేసి వాటి స్థలాలను మార్చారు. ఈ ఫొటోలను కూడా ‘టుస్సాడ్స్’ పోస్ట్ చేసింది. విడదీసిన ఏంజెలినా మైనపు బొమ్మను నికోల్ కిడ్మన్ విగ్రజం పక్కన ఉంచగా, బ్రాడ్ పిట్ విగ్రహాన్ని మోర్గాన్ ఫ్రీమన్స్ మైనపు బొమ్మ పక్కన ఉంచారు.

  • Loading...

More Telugu News