: అహ్మదాబాద్‌లో పాక్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించిన ముస్లింలు
పాకిస్థాన్ సరిహద్దుకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం ఉండే యూరీ ప్రాంతంలోకి ఉగ్రవాదులు చొరబడి దాడులు జరిపిన నేపథ్యంలో భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అహ్మదాబాద్‌లో ముస్లిం వర్గాలు ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించి, యూరీ దాడిని ఖండించాయి. మరోవైపు జమ్ములో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి పాకిస్థాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. న్యూఢిల్లీలో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆ దేశ రాయబార కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు ఆందోళనకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు.