: నాన్న ఉండి ఉంటే నా గురించి ఏమనుకుంటున్నారో విని చాలా బాధపడిపోయేవారు: షారుక్ ఖాన్
తనకు చెందిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ స్వాతంత్ర్య సమరయోధుడైన తన తండ్రిని గుర్తుకు తెచ్చుకుంటూ తాజాగా ఆసక్తికర పోస్టు చేశాడు. మనం మౌనంగా ఉన్నప్పుడే అధికంగా వింటామని తన తండ్రి తనకు చెప్పిన వ్యాఖ్యలను తాను ఆచరిస్తానని చెప్పాడు. అదృష్టవశాత్తు ఇప్పుడు తన తండ్రి లేరు కాబట్టి సరిపోయిందని ఆయన అన్నాడు. తన తండ్రి ఇప్పుడు ఉండి ఉంటే తన గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారో ఆయనకు తెలిస్తే చాలా బాధపడిపోయేవారని ట్టిట్టర్‌లో పేర్కొన్నాడు. ఇటువంటి వ్యాఖ్యలను తాను ఎందుకు పేర్కొనవలసి వచ్చిందో మాత్రం షారుఖ్ చెప్పలేదు. ప్రస్తుతం ఆయన ‘ద రింగ్’ చిత్రీకరణలో పాల్గొంటూ ఆమ్‌స్టర్‌డ్యాంలో ఉన్నాడు.