: గుంటూరు వాసికి అరుదైన గౌరవం... టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెస్కే ప్రసాద్


టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెస్కే ప్రసాద్ ఎంపికయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ ప్రస్తుతం బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. గతంలో టీమిండియాకు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ గా సేవలందించిన ఎమ్మెస్కే ప్రసాద్ రిటైర్మెంట్ అనంతరం టీమిండియాకు టెక్నికల్ స్పెషలిస్టుగా సేవలందించాడు. అనంతరం సౌత్ జోన్ కు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ గా సెలక్షన్ కమిటీలో చోటు సంపాదించుకున్నాడు. తాజాగా చీఫ్ సెలెక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. సౌమ్యుడిగా పేరున్న ఎమ్మెస్కే ప్రసాద్ ను సందీప్ పాటిల్ స్థానంలో నియమించడం ద్వారా బీసీసీఐ అతనికి అరుదైన గౌరవం కల్పించింది.

  • Loading...

More Telugu News