: ప్రత్యేక హోదా కోసం రేపు ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి


ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక సాయం ప్రకటించిన కేంద్రం తీరుని నిరసిస్తూ హోదా కోసం రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఏలూరులో యువభేరీ నిర్వ‌హించ‌నున్నారు. అందుకోసం ఏలూరులోని శ్రీ కన్వెన్షన్‌ హాల్‌లో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను వైసీపీ నేత‌ ఆళ్ల నాని స‌మీక్షిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌త్యేక సాయానికి స్వాగతం చెబుతూ హోదా అంశాన్ని ప‌ట్టించుకోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర‌ యువత భవిష్యత్‌ను నాశనం చేసిందని మండిప‌డ్డారు. రేప‌టి యువ‌భేరిలో పాల్గొనేందుకు యువ‌త‌ తరలి రావాలని కోరారు. రాష్ట్రానికి హోదా రాకపోతే నష్టపోయేది యువతేనని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హోదా రాక‌పోతే త‌లెత్తే స‌మ‌స్య‌లను యువతకు వివరించి చెబుతామ‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News