: సంగారెడ్డిలో స్కూలు పిల్లల సమక్షంలో పుట్టిన రోజు జరుపుకున్న సినీ నటి యామినీ భాస్కర్
తెలుగులో 'కీచక', 'టైటానిక్' సినిమాలతో పాటు తమిళంలో 'మున్నోడి' సినిమాలో హీరోయిన్ గా నటించిన వర్థమాన నటి యామినీ భాస్కర్ సంగారెడ్డిలోని ఓ గర్ల్స్ స్కూల్ లో సందడి చేసింది. పుట్టిన రోజును పిల్లల సమక్షంలో నిర్వహించుకోవాలని భావించిన యామినీ భాస్కర్ ఆ స్కూలుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆ స్కూలు విద్యార్థులు పరిశుభ్రమైన నీరు తాగేందుకు వాటర్ ప్యూరిఫైర్ ను అందజేసింది. పిల్లల మధ్య పుట్టిన రోజు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. ప్రస్తుతానికి ఓ స్టార్ హీరో సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నానని చెప్పింది. దాని వివరాలు త్వరలోనే తెలియజేస్తానని ఆమె చెప్పింది.