: హైదరాబాద్ లో ఏసీ బస్సుల్లో ఇకపై వైఫై సౌకర్యం
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఆ సంస్థ శుభవార్తనందించింది. త్వరలోనే ఏసీ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని తీసుకురావాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా తొలుత 115 బస్సుల్లో వైఫైను అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు అనుసంధానంగా ఉన్న ఐదు రూట్లతో పాటు పుష్పక్ బస్సుల్లో ఈ సేవలు లభిస్తాయి. రెండు వారాల్లోనే ఉచిత వైఫై అందుబాటులోకి రానుంది. ఈ వైఫై సేవలు మొదటి 20 నిమిషాలపాటు ఉచితంగా పొందవచ్చు. తరువాత 100 ఎంబీపీఎస్ డేటాకు 25 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో రాణీగంజ్- గచ్చిబౌలి, ఎన్జీవో -కేపీహెచ్‌బీ, ఈసీఐఎల్- గచ్చిబౌలి రూట్లలో కొత్తగా 16 బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక మొదటి దశలో వైఫై అందుబాటులోకి రానున్న రూట్లివే.. దిల్‌సుఖ్‌నగర్- లింగంపల్లి, కుషాయిగూడ- వేవ్‌రాక్, ఉప్పల్- వేవ్‌రాక్, ఉప్పల్ - లింగంపల్లి, ఎల్బీనగర్-పటాన్‌చెరు.