: సాక్షి మాలిక్ కు కోటి నజరానా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం


రియో ఒలింపిక్స్‌ లో కాంస్య పతకం సాధించి భారత్ కు తొలి పతకం అందించిన మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కు తెలంగాణ ప్రభుత్వం తాను ప్రకటించిన నజరానాను విడుదల చేసింది. హర్యానాకు చెందిన క్రీడాకారిణి సాక్షి మాలిక్‌ కు కాంస్య పతకం సాధించిన అనంతరం కోటి రూపాయల పారితోషికం అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో ప్రకటించినట్టుగా ఆమెకు కోటి రూపాయల నజరానాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్ గోపీచంద్ లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News