: నిజాంపేట చెరువుకు గండి... హుస్సేన్ సాగర్ లో ప్రమాదకర స్థాయికి చేరిన నీటిమట్టం
హైదరాబాదు వ్యాప్తంగా కురిసిన వర్షాలతో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాన్ని ఆసరాగా చేసుకున్న నగర శివార్లలోని కెమికల్ ఫ్యాక్టరీలు వ్యర్థాలను విడుదల చేశాయి. దీంతో నగర శివారు ప్రాంతాల్లో నురుగలు కక్కుతున్న నీరు ఇళ్లలోకి చేరింది. మరోవైపు నిజాంపేటలోని చెరువుకు గండిపడింది. హైదరాబాదు నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం 513.43 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో భారీ ఎత్తున నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కాస్త ఎడతెరిపి ఇవ్వడంతో హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ఖైరతాబాద్ సర్కిల్ వద్ద ఒకవైపు మాత్రమే వాహనాలు ప్రయాణిస్తున్నాయి.