: చైతూ నవ్వుతూనే ఒక హీరోయిన్ ని పడేశాడు: దాసరి నారాయణరావు
చైతూ నవ్వుతూనే ఒక హీరోయిన్ ని పడేశాడని దర్శకరత్న దాసరి నారాయణరావు చమత్కరించారు. చైతూ, సమంతాల ప్రేమను దృష్టిలో పెట్టుకుని దాసరి చేసిన ఆ వ్యాఖ్యకు అభిమానులు క్లాప్స్ కొట్టేశారు. ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో వేడుకలో దాసరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘అక్కినేని నాగేశ్వరరావుగారికి, నాకు యాభై సంవత్సరాల పరిచయం. ఆయనతో ఎన్నో హిట్ చిత్రాలు తీశాను. అవన్నీ ప్రేమ కథా చిత్రాలే. నాగేశ్వరరావు ప్రేమకథా చిత్రాల వారసత్వాన్ని నాగార్జున కొనసాగించాడు. దానిని చైతన్య, అఖిల్ పునరావృతం చేస్తున్నారు. నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ‘ప్రేమమ్’ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని దాసరి నారాయణరావు అన్నారు. అనంతరం ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో సీడీని ఆవిష్కరించారు.