: పఠాన్ కోట్ ప్రజలను పరుగులు పెట్టించిన ‘సూట్ కేసు’
చండీగఢ్ లోని పఠాన్ కోట్ లో ఈ రోజు ఒక సూట్ కేసు కలకలం సృష్టించింది. ఇక్కడి సింబల్ చౌక్ లో ఎవరూ క్లెయిమ్ చేయని ఒక సూట్ కేసు కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, యాంటీ సబొటేజ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. ఈ సూట్ కేసును వారు క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. దీంతో, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సూట్ కేస్ హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్న ఒక జవాన్ ది అనీ, అతను దానిని అక్కడ పెట్టుకుని మర్చిపోయాడని పోలీసులు గుర్తించారు.