: చెవిరెడ్డి సహా వైఎస్సార్సీపీ కార్యకర్తల అరెస్టు
వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని విడిచిపెట్టాలంటూ గుంటూరులో సీఐడీ కార్యాలయం ఎదుట బైఠాయించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేటి ఉదయం నుంచి సుదీర్ఘ విచారణ జరుగుతుండడంతో సీఐడీ అధికారులు భూమన కరుణాకర్ రెడ్డిని ఇంకా విడిచిపెట్టేలేదు. దీంతో ఆయను అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నడుమ, వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అక్కడ ఆందోళన నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.