: క్రికెటర్ ఇషాంత్ శర్మకు చికున్ గున్యా.. భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ కు దూరం
దేశ వ్యాప్తంగా విజృంభిస్తోన్న చికున్ గున్యా వ్యాధి బారిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ కూడా పడ్డాడు. దీంతో ఎల్లుండి కాన్పూర్ వేదికగా ఆడనున్న భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ కు ఆయన దూరమవుతున్నాడు. టీమిండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న సిరీస్‌కు ముందు ఇషాంత్ శర్మకు చికున్ గున్యా సోకడం పెద్దదెబ్బే. ఇషాంత్ స్థానంలో మరో పేసర్‌ను తీసుకొస్తామని ఈ సందర్భంగా టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే మీడియాకు తెలిపారు. కివీస్ జట్టు భారత్ తో మొత్తం మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే.